
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెల దర్శనం టికెట్ల కోటాను రేపటినుంచి (ఏప్రిల్ 19) విడుదల చేయనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.