
రాష్ట్రంలో ‘కూటమి’ అవినీతికి పరిశ్రమలు విలవిలలాడుతున్నాయ. కూటమి అరాచకంతో పరిశ్రమల మనగడ ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది’ ఇప్పటికే జిందాల్‌ను రాష్ట్రం నుంచి సాగనంపారు. నేడు కడపజిల్లాలోని సిమెంట్ కర్మాగారాన్ని మూయించే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అంటే ఇదేనా చంద్రబాబూ?’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.