హెచ్‌సీయూ అంశంపై ఓ ట్వీట్‌ను రీపోస్టు చేసినందుకు గచ్చిబౌలి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో పెద్దఎత్తున చెట్ల నరికివేతకు సంబంధించిన కేసులో, కంచె గచ్చిబౌలిలో తక్షణం 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరించాలి. లేకపోతే అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుంది’ అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని ‘లైవ్ లా ఇండియా’ పోస్టును షేర్ చేసిన ఎక్స్ పోస్ట్‌ను స్మితాసబర్వాల్ తనఖాతాలో రీపోస్ట్ చేశారు.

