
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు మొన్నటి వరకు వివిధ రకాల యాప్‌లతో పడుతున్న ఇబ్బందులను గమనించి కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) పేరుతో ఒక సమగ్ర యాప్‌ను విడుదల చేశారు. ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు అని తెలిపారు. ఈ యాప్‌లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డ్యాష్‌బోర్డు అనే ఆరు విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు.