
సినీ నటుడు రాజ్ తరుణ, లావణ్య వివాద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కోకాపేటలో తన కుమారుడు రాజ్ తరుణ్ కొనుగోలు చేసిన ఇంటిలో తాము ఉంటామంటూ బుధవారం ఆయన తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరిలు చేరుకున్నారు, వారు ఇంటి ముందు ఆందోళన దిగారు. ఇంట్లోకి వచ్చి తనను బలవంతంగా బయటకు నెట్టివేయాలని కుట్రలో భాగంగానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటామని చెప్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వ్యవహారం ఇంకా కోర్టులో కొనసాగుతుందని అప్పటివరకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనని లావణ్య అంటున్నారు.