
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) మొదటి విడతకు ఏప్రిల్ 15 నుంచి అన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అయితే టెట్ దరఖాస్తు ఫీజు చూసి అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు దరఖాస్తు చేస్తే రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించినట్లు ప్రకటనలో విద్యాశాఖ పేర్కొంది. అయితే గతంలో టెట్ ఫీజుకు మినహాయింపు ఇస్తామని పగల్భాలు పలికిన విద్యాశాఖ ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే గతంలో మాదిరి ఫీజులు నిర్ణయించడం గమనార్హం.