
పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పైన దాడికి ప్రయత్నించిన ఘటనలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేసారు. ఈ పరిణామాల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరు పర్చే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ చేయించి, ఆ నివేదిక ఆధారంగా 11 మందిని సస్పెండ్ చేశారు.
- 0 Comments
- Guntur District