
16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొం దరు నన్ను అడిగారని యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ అన్నారు. కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈరోజు తాను క్రియేట్ చేసిన ‘యంగ్ ఇండియా’ బ్రాండ్‌ను మహాత్ముడి స్ఫూర్తితో తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు.