
చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 125 శాతం సుంకం విధించి వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. దీంతో బీజింగ్ యూరోపియన్ యూనియన్ (EU), ఆసియాన్ దేశాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి అమెరికాను వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మరోస్ సెఫ్కోవిక్ మంగళవారం వీడియో ద్వారా చర్చలు జరిపారు.