
గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.21.45 కోట్లు అదనంగా చెల్లిస్తుంది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.905కు, నల్గొండలో రూ.927కు, విజయవాడలో రూ.875.50కి చేరింది.