
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ సలహాదారు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ట్రాలో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని, ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని, మెడిక్‌ఎయిడ్, సామాజిక భద్రత పథకాలకు నిధుల కోతను ఆపాలని, వలసదారులు, ట్రాన్స్‌జెండర్లు, ఇతర కమ్యూనిటీలపై దాడులను ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.