
తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2025 సంవత్సరానికి ” ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు ” అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948లో, WHO మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది