సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలో డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు, కస్టోడియల్ హింసపై కఠిన సందేశం ఇచ్చింది. కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మొబైల్ యాక్సెసరీస్ దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో జయరాజ్, బెనిక్స్లను పోలీస్ స్టేషన్లో నిరంతరంగా కొట్టడంతో తీవ్ర గాయాలు, బలమైన దెబ్బల వల్ల వారు మృతి చెందినట్లు వెల్లడైంది.

