వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు దగ్గరకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.కోర్టు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన
భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ అభిమానులు తరలివచ్చారు. అంతేకాదు రప్ప రప్ప బ్యానర్లు, ప్లకార్డులను సైతం ప్రదర్శించారు . ‘2029లో రప్పారప్పా’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటూ రాసుకొచ్చారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

