ఇటీవల రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్, రష్మిక రద్దుచేసుకొన్న నిశ్చితార్థం, నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన విభేదాల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో ఎనిమిదేళ్ల క్రితం ఒక కన్నడ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించినదని, కన్నడ మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని, ఆడియో క్లిప్‌లను 24 గంటల్లోగా తొలగించాలని రష్మిక డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

