79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది.. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వ సారి భారత ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న.. సురక్షిత.. సాహసోపేత నవ భారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరగనుంది. ఎర్ర కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

