రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 76వ ప్రజాదర్బార్‌కు తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి లోకేశ్ కి విన్నవించారు. వారి నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, కొందరికి అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
అందరి సమస్యలు ఓపిగ్గా వింటూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్‌ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వినతులు స్వీకరించారు.

