శిరోమణి అకాళీ దళ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియాపై అక్రమాస్తుల ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అతనిపై కేసులో విచారణ చేపడుతున్నది. అయితే మజీతియాపై దర్యాప్తు చేపట్టేందుకు
పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా శనివారం అనుమతి ఇచ్చారు. మాజీ మంత్రి మజీతియా వద్ద సుమారు 700 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2013లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ద్వారా సుమారు 540 కోట్లు ఆయన మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు కేసు బుక్కైంది.

