రాష్ట్రంలో 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 మందికి ఈ పదోన్నతులు లభించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిసిఎల్ఏ కమిషనర్ లోకేశ్కుమార్బుధవారం జారీ చేశారు. పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టిజిటిఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టిజిఆర్ఎస్ఏ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

