చెన్నైలోని పెరుంగుడి డంప్‌యార్డ్‌ను బయో మైనింగ్ ద్వారా అత్యాధునిక ఫర్నిచర్‌గా మార్చిన తీరుకు మంత్రముగ్ధులైన ఆనంద్ మహీంద్రా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 50 ఏళ్లుగా చెత్త కొండగా ఉన్న పెరుంగుడి డంప్‌యార్డ్ ప్రాంతం ఇప్పుడు అందమైన ఫర్నిచర్‌గా ఎలా మారిందో వివరిస్తూ.. భారతదేశ వ్యర్థాల సమస్యకు ఇది ఒక గొప్ప పరిష్కారమని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. చెన్నై నగరం వ్యర్థాల నుంచి సంపద సృష్టించడంలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

