
అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి జర్మనీలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఉద్యోగాల కాల్ లెటర్స్ అందాయి. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDUGKY) – విదేశ్ అనుసంధానంతో గ్రామీణ యువతకు అంతర్జాతీయ ప్లేస్ మెంట్స్ లక్ష్యంగా సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.