
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ జీవో (జీఓ.ఎంఎస్. నెం.09/2025) జారీ చేయడం చట్టవిరుద్ధం అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించిన ధర్మాసనం, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా మెరిట్ ఆధారంగా విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.