పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్‌పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.

