దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలు ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీంతో ఆ రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిద్ధమైంది. 2019 నుంచి ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో అయినా పోటీ చేయాలన్న ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,800కు పైగా నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది.

