
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో నడుస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసం ముఠాను జిల్లా పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా ఛేదించారు. ఈ ముఠా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతోంది. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను నియమించి, స్క్రిప్ట్‌లు, మోసపు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నారు. ఈ దాడుల్లో మొత్తం 33 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.