బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.. నితీశ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. బీహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసిన నేతగా రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హ ప్రమాణం చేశారు. బీజేపీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

