
సాయంత్రం 8:30 గంటలకు డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించిన పాకిస్తాన్ తన సివిల్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించారు. భారత్‌పై చేసిన దాడికి.. వెంటనే ఇండియన్ ఆర్మీ ప్రతిస్పందింస్తుందని తెలిసినప్పటికీ.. పాకిస్తాన్ తమ పౌర విమానాలను ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకుందని తెలిపారు. భారత్ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో మన పౌర విమాన రాకపోకలు లేకుండా పూర్తిగా ఖాళీగా ఉందని.. అయితే అదే సమయంలో కరాచీ, లాహోర్ మధ్య విమాన మార్గంలో పౌర విమానాలు ఎగురుతున్నట్లు వివరించారు.