బీజేపీ పాలిత గోవాలో బీజేపీ కార్పొరేటర్ సుశాంత్ నాయక్ కుమారుడైన 22 ఏళ్ల సోహమ్ దారుణాలు బయటపడ్డాయి. సుమారు 30 మంది బాలికలపై మూడేళ్లుగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఆ యువకుడు ఈ వీడియోలను వారికి చూపించాడు.ఇది తెలుసుకుని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. సోహమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

