జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బిజెపి, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్ సర్కార్‌ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని,రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

