విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని భట్టి విక్రమార్క అన్నారు. సీఎం, కేబినెట్ సహచరులు కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేరడానికి పెట్టుబడులు రావాలని, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని వెల్లడించారు. ఆ దిశగా విద్యుత్ తయారు
చేసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నామని, ఎనర్జీ వినియోగంలో భారత్ ఆరో స్థానంలో ఉందని గుర్తు చేశారు.

