
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. గురువారం రాత్రి ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు, ప్రతిదాడులకు దిగారు. జమ్మూ, పఠాన్ కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డట్లు రక్షణ శాఖ తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దును దాడుకుని వచ్చి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు దిగినట్లు తెలిపారు. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఈ దాడులకు సమర్ధవంతంగా అడ్డుకుంది.