అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ సూచీల్లో జోష్ నింపాయి. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు మదుపర్లలో విశ్వాసాన్ని పెంచాయి. దీంతో గురువారం దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతన్నాయి

