
సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా ‘25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. శేఖర్ కమ్ముల సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేశారు. టీనేజీలో ఒక్కసారి చిరంజీవిని దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్… అంతే.