
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎవరికోసమో.. హరీష్ రావును టార్గెట్ చేస్తూ.. మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తేల్చుకోవడానికి పద్ధతులు వేరే ఉన్నాయని, శత్రువులకు బలం చేకూర్చేలా మాట్లాడటంలో ఎజెండా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేయగా… నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్కు కవిత కౌంటర్ ఇచ్చారు.