
కాకినాడలోని ఏలేశ్వరంలో ఏలేరు కాలువలో కాలుజారి పడి వదినా, మరదలు మృతి చెందారు. బట్టలు ఉతటానికి ఏలేరు కాలువ దగ్గరికి పెండ్ర లక్ష్మి, కుమారి వెళ్లారు. ప్రమాదవశాత్తు కుమారి కాలు జారి పడిపోయింది. కుమారిని రక్షించడానికి ప్రయత్నించిన వదిన లక్ష్మి కూడా నీటిలోకి దూకింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మునిగిపోయి నీళ్లల్లో గల్లంతయ్యారు. స్థానికులు ఇద్దరిని బయటకు తీశారు. వెంటనే హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.