
21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం అన్నారు ప్రధాని. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమన్నారు. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగిందన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం మరింత శక్తినిస్తుందన్నారు.