
రామభద్రపురం మండలం రొంపిల్లి పామాయిల్ తోటలో నివసిస్తున్న తొమ్మిది నెలల నిండు గర్భిణీ అయిన పార్వతీకి అకస్మాత్తుగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో మండల కార్యాలయం ఆవరణలో చెట్టు క్రిందే ఆరుబయట ప్రసవం జరిగి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సమయంలో తోడుగా ఉన్న పదకొండేళ్ల కూతురే సపర్యలు చేసి తల్లికి సేవలు చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు మెరుగైన చికిత్స అందించారు. .