దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోదీ రూపంలో లభించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలో భారీ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఐటీ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు.. ఎంతో అవమానించారని గుర్తు చేసుకున్నారు. కానీ ఐటీ రంగం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నారని వివరించారు. 1991లో మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని.. చైనా ఆ విషయంలో ఎంతో ముందుకెళ్లిపోయిందన్నారు. టెక్నాలజీ సులువుగా అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇప్పుడు ఏఐ వచ్చేసిందన్నారు.