
భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో (ISRO) చీఫ్ వీ నారాయణన్ తెలిపారు. 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM) తయారీ వంటి లక్ష్యాలను ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. 2040లో వికసిత భారత్ దూతగా భారతీయ వ్యోమగామి చందమామపై అడుగుపెట్టనున్నాడని నారాయణ్ తెలిపారు.