loader

హనుమజ్జయంతి

హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను

World Autism Awareness Day

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం (World Autism Awareness Day) జరుపుకుంటారు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ఉన్న వ్యక్తుల హక్కులు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు సమాజంలో వారికి అవగాహన, మద్దతు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.

లక్నోపై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ.

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్యాన్ని .. ఓవర్లో .. వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఒక దశలో 26 పరుగలకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాచ్ ఓడిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన సమీర్ రిజ్వి నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 70 (5 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులు సాధించాడు.

ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మహిళా కార్మికులు మృతి!

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం జల్నా జిల్లాలో నాగ్‌పుర్-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై టెంపోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మహిళా కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేపై పారిశుధ్య పనులు పూర్తి చేసుకున్న మహిళల బృందం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉన్నట్లు తెలిపారు.

రేపు హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

గురువారం ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తాడిబండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటిఒ తాడిబండ్, ఇసిఐఎల్, ఎఎస్ రావు నగర్, సైనిక్‌పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ […]

యుద్ధ పరిస్థితులపై ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం..

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై, అలాగే దేశ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్‌పై పడే ప్రభావంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో సీసీఎస్ రెండోసారి సమావేశం ఇది. దేశ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.

ఇది చారిత్రాత్మక ఘట్టం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

కిడ్నాప్ అయిన లేడీ జర్నలిస్టు

ఇరాక్‌లో కిడ్నాప్ అయిన అమెరికా లేడీ జర్నలిస్టు షెల్లీ రెనీ కిటెల్సన్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఇంతకు ముందు కూడా ఇరాక్‌లోకి అక్రమంగా రావడానికి యత్నించారు. అయితే అప్పుడు తిప్పి పంపించారు. తరువాత స్వల్ప కాలిక ప్రవేశ అనుమతి వీసాతో ఏదో విధంగా బాగ్దాద్ చేరుకుందని. బాగ్దాద్ వీధులలో రెండు కార్ల ద్వారా ఆమెను నాటకీయంగా కిడ్నాప్ చేసినట్లు సిసిటీవీ కెమెరాలతో వెల్లడైంది. ఆమె జాడ తెలియడం లేదు. ఇరాన్ మద్దతు గల కతైబ్ హెజ్‌బోలా మిలిటెంట్ల ముఠా […]

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై అభిప్రాయ సేకరణ..

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయి.. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా.. అనే అంశాలపై అభిప్రాయ సేకరణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ‌ల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని అధికారులు నిర్ణయించారు.

తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ ఛార్జీలు.. నేటి నుంచే అమలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ రకాల ధృవీకరణ పత్రాలు, బిల్లు చెల్లింపుల కోసం వసూలు చేసే యూజర్ ఛార్జీలను భారీగా పెంచింది. తక్షణమే లభించే ఏ-కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి సేవలకు రూ. 62 వసూలు చేయనుండగా.. ఇన్‌కం, క్యాస్ట్, నివాస ధృవీకరణ పత్రాల వంటి బి-కేటగిరీ సేవలకు రూ. 80గా ధరను నిర్ణయించారు. స్థానికత ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. ప్రస్తుతం రూ.80కి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON