loader

కివీస్ ఓటమితో పాకిస్థాన్ ఖుష్!

తాజా ఓటమితో కివీస్ సెమీఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టం అయ్యాయి. సూపర్ 8లో ఒక్కో విజయం, ఓటమి (మరో మ్యాచ్ రద్దు)తో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఫలితంతో పాకిస్థాన్ సంతోషంగా ఉంది. కివీస్ ఓడడంతో పాక్​ సెమీస్​ రేస్​లో ఉంది. రేపు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్​లో పాక్ భారీ తేడాతో నెగ్గితే సెమీస్​కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కివీస్ రన్​రేట్ +1.390 (3 పాయింట్లు)తో ఉండగా, పాకిస్థాన్ -0.461 […]

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం

సూపర్ 8లో ఇంగ్లాండ్ హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్ 2లో సెమీస్ రేసు ఇంకా ఆసక్తికరంగా మారింది. కివీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్​ను ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. టామ్ బంటన్ (33 పరుగులు) రాణించాడు. విల్ జాక్స్ (32 పరుగులు), రెహాన్ అహ్మద్ (19 పరుగులు, 7 బంతుల్లో) చివర్లో మెరుపులు మెరిపించడంతో ఉత్కంఠ పోరులో ఇంగ్లిష్ […]

బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకాలు – తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు – 3.45 లక్షలమంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు – బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి రాష్ట్రంలో నిల్వ సదుపాయం కలిగిన 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే బాలికలకు వ్యాక్సిన్ అందిస్తారని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. తొలివిడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయన్నారు. బాలికలకు వాక్సిన్​ను డిస్ట్రిక్ట్​లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే తేదీల్లో ఇస్తారని తెలిపారు.

ఎపి హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్

ఎపి హైకోర్టు సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఎపి హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సిజె) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ – హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసే అంశంపై […]

పొరపాటున ఒడిశా చేరుకున్న బెంగాల్‌ ‘సర్‌’ అధికారులు.. చితక్కొట్టిన గ్రామస్తులు

ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించిన గ్రామస్తులు వారిని చితక్కొట్టారు. ఈ నేపథ్యంలో 72 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎన్నికల అధికారులను నిర్బంధించారు. వారిపై గుంపుగా దాడి చేసి కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారులను విడిపించి కాపాడారు.

‘జీఐ ఆన్​వీల్స్’ టీజీఎస్​ఆర్టీసీ – పొచంపల్లి నుంచి ప్రపంచానికి తెలంగాణ కళలు

తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన కళలకు మరింత ప్రాచుర్యం కలిగించేలా ప్రభుత్వం ఆర్టీసీ సమన్వయంతో హైదరాబాద్​లోని ఎంజీ బస్టాండ్​లో ‘G.I ఆన్‌ వీల్స్’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌ ఎంజీబీఎస్​ బస్టాండ్‌లోగవర్నర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 6 జీఐ ట్యాగ్​లు ఉన్నాయి. పొచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్​ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ పెయింటింగ్ చిత్రాలతో బస్సులపై ప్రచారం కల్పించేలా ఆర్టీసీ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.

ఉద్దేశ్య పూర్వకంగానే క‌ర్ల రాజేశ్ రీ పోస్ట్‌మార్టం ఆలస్యం : మందకృష్ణ మాదిగ

పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్‌ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజేశ్‌ మరణించిన వారం రోజులు లోపే రీపోస్టు మార్టం చేసినట్లయితే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవన్నారు. కాలం గడిచే కొద్దీ మృతదేహం కుళ్లిపోయి ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే వంద రోజులపాటు కాలయాపన చేశారని విమర్శించారు. రాజేశ్‌ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగద‌ని తెలిపారు.

గూగుల్ సరికొత్త ఏఐ కెరీర్ సర్టిఫికేట్

గూగుల్ సంస్థ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త  AI ప్రొఫెషనల్ సర్టిఫికేట్  కోర్సును 2026 ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కేవలం 10 గంటల వ్యవధిలో పూర్తి చేయగల ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లో ఏడు చిన్న కోర్సులు,  ఒక ప్రాజెక్ట్ ఉంటాయి. ఇందులో భాగంగా జెమిని ,  నోట్‌బుక్ ఎల్‌ఎమ్ వంటి అడ్వాన్స్‌డ్ టూల్స్‌ను ఉపయోగించి రిసెర్చ్ చేయడం, డేటా విశ్లేషణ, కంటెంట్ క్రియేషన్,  ఆటోమేషన్ పనులను ఎలా వేగంగా పూర్తి చేయాలో నేర్పిస్తారు.

రీల్‌ తెచ్చిన చిక్కులు.. ఆరుగురు ట్రైనీ పోలీసులకు షోకాజ్‌ నోటీసులు

రేవాలోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ పోలీసులు ఒక రీల్‌ తీశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంపై గొప్పలు పోయారు. ‘నేను అందంగా లేకపోతే ఏం? నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నా వద్ద ఎక్కువ డబ్బు లేకపోతే ఏం? నాకు నెలవారీ జీతం వస్తుంది. నాకు ఎక్కువ బట్టలు లేకపోతే ఏం? నాకు యూనిఫాం ఉంది’ అని వారు అన్నారు. ఈ నేపథ్యంలో వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి తదుపరి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON