loader

‘ఉస్తాద్ భగత్​సింగ్’లో పొలిటికల్ రిఫరెన్స్?- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్

పవర్​స్టార్ పవర్​ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్​సింగ్’ సినిమా వీడియో గ్లింప్స్​లో ‘గాజు ముక్క’, అలాగే ఈ పాటలో పవన్ మేనరిజం చూసి ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్​లు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కొంతమంది ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు, విమర్శలు లాంటివి ఇందులో ఉంటాయా? అని దర్శకుడు హరీశ్​ను అడుగుతున్నారట! అందుకే ఈ అంశంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్​లు ఉండవని స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం వినోదం […]

మీ ఆస్తులు ప్రకటిస్తారా… స్టాలిన్‌కు విజయ్ సవాల్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై తమిళగగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ విమర్శల దాడి పెంచారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం ప్రజాభవన్‌లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం డైరీని ఆవిష్కరించిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు, సభ్యుల సంక్షేమం కోసం మా కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

కరన్ కోట్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామంలో సోమవారం ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు (45) అనే వ్యక్తిపై రుద్రారం బాలు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నిందితుడు సాయిలు మెడపై బలంగా నరకడంతో, అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలే జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

కువైట్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ – రక్షించాలంటూ ఆడియో విడుదల

ఏలూరు జిల్లా కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి ప్రశాంతి రెండేళ్ల కిందట పని కోసం కువైట్​కు వెళ్లింది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడి ఇంటి యజమానులు నిరాకరించారు. పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఆమెపై దొంగతనం నేరం మోపి జైలుకు పంపించారు. అక్కడి కోర్టు పూర్తిస్థాయి విచారణ చేసి ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు. దీనిపై అక్కడ ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆడియో రికార్డింగ్ చేసి కుటుంబ […]

అలా అయితే ఫైనల్స్​కు​ వెళ్తా – వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్

కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీదే అన్నారు. మార్కెట్​లో కిలో నెయ్యి 1000 రూపాయలు పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటని? ప్రశ్నించారు. టీ20 ప్రపంచ కప్​లో ఇండియా ఫైనల్స్​కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటాని వెల్లడించారు. బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా […]

పసికందు మృతిపై సీతారాంపురంలో కొవ్వొత్తుల ర్యాలీ

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మరా గ్రామంలో జాతర సందర్భంగా జ‌రిగిన పసికందు మృతిని నిరసిస్తూ కారేపల్లి మంఢలం సీతారాంపురంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో యువకులు కొవ్వొత్తులు పట్టుకుని కుల వివక్షత, అణగారిన వర్గాలపై దాడులను నిరసించారు. పసికందు బేబి మౌనిక కుల మౌడ్యానికి బలి కావటం విచారకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులకు అండగా ఉండాల్సిన అధికార వ్యవస్ధ దాడి చేసిన అగ్ర కులస్తులకు వత్తాసు పలుకుతూ […]

సృష్టి కేసులో.. డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..

సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారణ జరగనుంది. ఈ కేసు సరోగసీ పేరుతో అక్రమాలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో సంబంధం ఉండటంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే: వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటును పొడిగించడంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. పదవి విరమణ వరకు దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ని సస్పెండ్ చేయడం అంటే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అహం సంతృప్తి పరచడం కోసం దళిత వర్గాలపై చంద్రబాబు చూపిన వివక్షకు ఇది నిదర్శనం అని చెప్పుకొచ్చారు

హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి తెలంగాణ కేబినెట్ ఓకే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్ అండ్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఐడీబీఐ అందించిన ఆర్థిక నివేదికలు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చిన సాంకేతిక నివేదికలకు మంత్రివర్గం ఆమోదం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON