5 సిక్సులు, 10 ఫోర్లు.. సెంచరీతో ఆసీస్ తాట తీసిన నిస్సంక.. తొలి ప్లేయర్ గా రికార్డ్
శ్రీలంక పలకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పథుమ్ నిస్సంక చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించేలా చేశాడు. ఈ విజయం ద్వారా శ్రీలంక జట్టు సూపర్ ఎయిట్స్‌కు కూడా అర్హత సాధించింది. 2026 T20 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా నిస్సంక నిలిచాడు.

