ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

