కాలుష్య తీవ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన
విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడచిన రెండేళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

