loader

ఏపీలో రాహుల్ పర్యటన.. ఉపాధి హామీ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పోరు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో  సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే భారీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె రాహుల్‌ను ఆహ్వానించారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచే  MGNREGS పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, మహాత్మా గాంధీ పేరును తొలగించినందుకు నిరసనగా ఫిబ్రవరి 2న బండ్లపల్లి వేదికగా […]

షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్

బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ తన సంగీత ప్రయాణంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలానికి పైగా తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆయన, ఇకపై సినిమా పాటలకు  స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు సమాచారాన్ని తెలియజేస్తూ.. “నేను ముగింపు పలుకుతున్నాను” (I am calling it off) అని పేర్కొన్నారు. గడిచిన ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దేవుడు […]

రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి  ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర  ప్రజలందరికీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలైన సమ్మక్క,  సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్‌ చెప్పారు.

బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక.. ప్రతి ఏడాది ఈ సంప్రదాయం

వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది.ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు,  జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగింది. బడ్జెట్ తయారీలో  పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హల్వా వేడుక తర్వాత బడ్జెట్‌ డాక్యుమెంట్ల తయారీలో నేరుగా పాల్గొన్న  అధికారులంతా లాక్-ఇన్ పీరియడ్‌లోకి వెళతారు. ఈ కాలంలో దాదాపు 60 నుంచి 70 మంది అధికారులు,  ఉద్యోగులకి బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు […]

సామాన్య కార్యకర్తగానే చంద్రబాబు నాయుడు… టీడీపీ వర్క్‌షాప్‌లో

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్‌లో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగిస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఒక సాధారణ కార్యకర్తలా పాల్గొన్నారు. వర్క్ షాప్‌లో పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్ […]

కోల్‌ మాఫియాకు నాయకుడిలా తెలంగాణ సీఎం : కేటీఆర్‌

సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని. తెలంగాణ సీఎం కోల్‌ మాఫియాకు నాయకుడిలా మారిపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ఫిర్యాదు చేశారు. ఏ బొగ్గుగనిలో లేని నిబంధన సైట్‌ విజిట్‌ సర్టిఫికేషన్‌ విధానం ఎందుకు పెట్టారు…? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు […]

తమిళనాట డీఎంకే కూటమిలో ప్రకంపనలు – పవర్ షేరింగ్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్

తమిళనాడులో  డీఎంకే నేతృత్వంలోని  కూటమి పార్టీల్లో  విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.రాష్ట్ర ప్రభుత్వంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌పై డీఎంకే సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవినే కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న బాహాట విమర్శలు కూటమి ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే  జి. తలపతి ..  కాంగ్రెస్ ఎంపీలు బి. మాణిక్యం ఠాగూర్  , ఎస్. […]

బంగ్లాదేశ్ చెరలో బందీలుగా ఉన్న భారతీయ జాలర్లకు విముక్తి

బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛను పొందారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం మత్స్యకారుల విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్ స్వయంగా డాకా నుంచి జైలుకు చేరుకుని మత్స్యకారులను విడుదల చేశారు.

జనవరి లాస్ట్‌ వీక్‌లో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, హులు వంటి వేదికలపై పలు భాషల్లో వినోదభరిత కంటెంట్ స్ట్రీమింగ్‌కు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 1’, ‘చాంపియన్’, ‘ధురంధర్’ విడుదల కానుండగా, ప్రైమ్ వీడియోలో ‘డల్డల్’ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ‘గుస్తాఖ్ ఇష్క్’, ‘సర్వం మాయ’ సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. తెలుగు ప్రేక్షకులకు […]

మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. రేపటి నుంచే నామినేషన్‌లు

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31వ తేదీతో నామినేషన్ల స్వీకరణకు గడవు ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON