loader

రాబోయే తరాలకు మీరే స్ఫూర్తి.. పద్మ పురస్కార గ్రహీతలను అభినందించిన కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారకరామారావు (KTR) హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించడం ముదావహమని, ఈ పురస్కారాలు రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆయన ఆకాంక్షించారు. పురస్కార గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపిన ఆయన.. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులు దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన కోరారు.

స్మృతి మంధానా స్నేహితుడిపై పలాష్ పరువు నష్టం దావా… 10 కోట్లు కట్టు!

పెళ్లికి కొన్ని గంటల ముందు, వివాహ సమయంలో మరొక మహిళతో మంచం మీద రెడ్ హ్యాండెడ్‌గా పలాష్ ముచ్చల్ పట్టుబడ్డాడని,భారత మహిళా క్రికెట్ జట్టు అతన్ని తీవ్రంగా కొట్టిందని స్మృతి మంధాన స్నేహితుడు విద్యాన్ మానే వెల్లడించాడు.ఈ ఆరోపణల పట్ల పలాష్ పరువు నష్టం దావా వేశాడు. న్యాయవాది శ్రేయాన్ష్ మిఠారే ఇవాళ సాంగ్లి నివాసి విద్యాన్ మానే నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసు […]

అనిల్ రావిపూడికి మెగాస్టార్ గిఫ్ట్… చిరంజీవి రేంజ్‌కు తగ్గట్టు అదిరిపోయే కార్

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. కారు నచ్చిందా?’ అని అడిగారు. అప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మందు కొట్టడానికి ముందు చిరంజీవి చెప్పిన డైలాగ్ కాస్త మార్చి చెప్పారు అనిల్ రావిపూడి. ‘మెగా బహుమతి మహదానందం మనో ధైర్యం ధనాధన్’ అంటూ […]

ఎస్సైని ఢీకొట్టి.. బానెట్‌పై SI తో సహా దూసుకెళ్లిన కారు..

హైదరాబాద్ శివారు ప్రాంతమైన యాచారంలో ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో భాగంగా వేగంగా వస్తున్న ఒక కారును ఆపాల్సిందిగా ఎస్ఐ మధు సైగ చేస్తూ ఎస్ఐ మధు ఆ కారుకు అడ్డుగా వెళ్లగా.. నిందితుడు ఏమాత్రం కనికరం లేకుండా ఆయనను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎస్ఐ కారు బానెట్‌పై పడిపోగా.. డ్రైవర్ కారును ఆపకుండా అలాగే సుమారు వంద కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే […]

వాదన వినిపించండి.. నిధులు తీసుకురండి.. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్‌లో బలంగా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రెండో విడత నిధులు, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్‌కు నిధులు, వంటి అంశాలపై […]

అభిషేక్, సూర్య ఊచకోత..10 ఓవర్లలోనే భారత్ ఘన విజయం

మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు న్యూజీలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు. మ్యాచ్ ప్రారంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. సూర్య 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరులతో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్ డౌన్ లో వచ్చిన ఈషాన్ కిషన్ భారీ సిక్సులతో కివీస్ బౌలర్లకు షాకిచ్చాడు. కిషన్ 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం […]

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)ను సందర్శించి తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర వరించింది. ఈ నెల 26న దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోనున్నారు. సాధారణంగా యుద్ధభూమికి ఆవల జరిగే ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, అత్యంత సాహసోపేతమైన రక్షణ చర్యలకు ఇచ్చే ఈ పురస్కారాన్ని.. తొలిసారిగా అంతరిక్ష పరిశోధనలో చూపిన అసమాన ధైర్యసాహసాలకు ఇవ్వడం […]

ఆర్థిక వ్యవస్థకు రైతులే మూలస్తంభాలు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే మూలస్తంభాలు. వ్యవసాయం నుంచి అంతరిక్ష వరకు, స్వయం ఉపాధి నుంచి రక్షణ రంగం వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది […]

స్కూల్‌‌లో పిల్లలకు పాఠాలు చెప్పకుండా… రీల్స్ టీచర్ సస్పెండ్

ఖమ్మం మామిళ్ళగూడెం ప్రభుత్వ హై స్కూల్ ఉపాధ్యాయురాలు గౌతమిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.. ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకి ప్రమోషన్స్, ఇన్ స్టా రీల్స్ చేస్తున్న టీచర్ గౌతమిపై ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ప్రమోషన్.. అలాగే స్కూల్ సమయంలో రీల్స్ చేస్తోందని గతంలో హెచ్చరించినా తీరు మార్చుకోలేదని పేర్కొన్న డీఈవో.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

క్రీడా దిగ్గజాలకు పద్మ పురస్కారాలు..

భారత టెన్నిస్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విజయ్ అమృత్‌రాజ్‌కు గౌరవప్రదమైన ‘పద్మభూషణ్’ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ‘పద్మశ్రీ’ వరించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులు సృష్టించిన రోహిత్, 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి దేశం గర్వపడేలా చేశారు. మహిళా క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు.ఆమెతో పాటు హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఫుట్‌బాల్ దిగ్గజం ఐ.ఎం. విజయన్‌లకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON