loader

ఆస్కార్‌ నామినేషన్స్‌-2026.. ఏకంగా 16 కేటగిరిల్లో ‘సిన్నర్స్‌’..

సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న 2026 ఆస్కార్ నామినేషన్లను అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాల మధ్య ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది నామినేషన్లలో రేయాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్‌’ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని, గతంలో ‘టైటానిక్’, ‘లా లా ల్యాండ్’ పేరిట ఉన్న 14 నామినేషన్ల రికార్డును బ్రేక్ చేసింది. ‘సిన్నర్స్‌’ తర్వాత ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం […]

మేడారంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం…

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్ నుంచి మేడారం వరకు వెళ్లి తిరిగి రావడానికి రౌండ్-ట్రిప్ హెలికాప్టర్‌ రైడ్‌ కోసం రూ.35,999 ఛార్జీ చేయనున్నారు. ఇక, మేడారం పరిసరాల్లో విహంగ వీక్షణం చేయాలని అనుకుంటే రూ. 4,800 చెల్లించాల్సి ఉంటుంది. ఏడు నిమిషాల పాటు మేడారం పరిసరాల్లో […]

పట్టాలపై ట్రక్కు.. వేగంగా వస్తున్న రైలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలోని నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ భారీ ట్రక్కు.. రైలు పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ గుండా గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ముందు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రక్కు ముందుకు వెళ్లలేక ట్రాక్ పైనే నిలిచిపోయింది. దీంతో ఆ రైలు, ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. . దీంతో ట్రక్కును ఢీకొట్టిన రైలు అక్కడే ఆగిపోయింది ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు

కూటమి ఉన్నంత కాలం జగన్ గెలవరు- పాదయాత్ర వేస్ట్ : విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన ఆయన ఏడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారని లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. కూటమిని విడగొట్టే రాజకీయం.. ప్రస్తుతం ఉన్న కోటరీకి తెలియదన్నారు. కోటరీలో పందికొక్కులు ఉన్నారని.. జగన్ పై పడి తిన్నారని.. ఇప్పటికీ తింటున్నారని అన్నారు.లిక్కర్ స్కాం జరిగినట్లుగా జగన్ కు తెలియదని తెలిసినట్లయితే.. స్కాం చేయించేవారు కాదన్నారు.

రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలకు నేనే బాధితుడ్ని.. బీజేపీ సీఎం

గాంధీ కుటుంబంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీలో ఉన్నప్పుడు వాటికి తానే బాధితుడ్ని అని ఆరోపించారు. ‘కేరళ వ్యవహారాల్లో ప్రియాంక జోక్యం చేసుకోవడం రాహుల్‌కు ఇష్టం లేదు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మధ్య సఖ్యత లేదని, అందుకే ప్రియాంకను కేరళకు బదులుగా అసోం ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించారని శర్మ పేర్కొన్నారు.

కొండాపూర్‌ భూవివాదం- రూ.4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ

ఏపీ, తెలంగాణ మధ్య ఓ కొత్త భూవివాదం ప్రారంభమయింది. హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉన్న 42.03 ఎకరాల అత్యంత విలువైన భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ బాలాసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్‌ కు కేటాయించిన ఈ భూమిని, తమకు సమాచారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం భూపతి ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఖరీదైన భూమి భవిష్యత్తు […]

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి లోకేశ్ భేటీ

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపిక‌ను అందజేశారు.మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను సీఎం సత్కరించారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతూనే, అభివృద్ధి విషయంలో సహకరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌తో హరీష్ చర్చలు – కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లు, అవి తీవ్రమైనవేనని.. బీఆర్ఎస్ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారని ఆ పార్టీ న్యాయవ్యవహారాలు చూసే సోమా భరత్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో ప్రజలపై కాల్పులు.. ముగ్గురు మృతి

ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాకర్ స్ట్రీట్‌లో కొందరు దుండగులు ప్రజలపై తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి మృతి చెందగా.. మరోకరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి […]

ఏపీలో చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్?… అధ్యయనంపై మంత్రి లోకేశ్

సోషల్ మీడియా బ్యాన్‌పై ఏపీ విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నట్లు ప్రకటించారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON