loader

JEE మెయిన్ పేపర్ లీక్ అయ్యిందా? విద్యార్థులకు NTA అలర్ట్

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ 2026 – సెషన్ 1)కు సంబంధించి పేపర్ లీక్ అయ్యిందనే వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా ఖండించింది. “సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ‘పేపర్ లీక్’ ఆరోపణలు పూర్తిగా నకిలీవి మరియు తప్పుదారి పట్టించేవి. విద్యార్థులు ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు, ఎలాంటి చెల్లింపులు చేయవద్దు. పరీక్షలకు సంబంధించిన నిజమైన, అధికారిక సమాచారం కోసం కేవలం NTA అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించండి” అని NTA […]

ఐరోపా దారి తప్పింది.. అమెరికాదే అద్భుత ప్రగతి: దావోస్‌లో ట్రంప్ ఫైర్

దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక ‘ఎకనామిక్ మిరకిల్’ అని అభివర్ణించారు. ఐరోపా దేశాలు సరైన దిశలో వెళ్లడం లేదని, అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాటో కూటమి దేశాలు రక్షణ వ్యయం విషయంలో అమెరికాపై భారం మోపుతున్నాయని, తాము రక్షణ కల్పిస్తున్నా తగిన మూల్యం చెల్లించడం లేదని మండిపడ్డారు. గ్రీన్లాండ్ ప్రతిపాదనను తిరస్కరించడం పట్ల, వారు కృతజ్ఞత […]

ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు.. పునరావాసం కల్పిస్తున్న తెలంగాణ పోలీస్‌ శాఖ..!

అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తోంది. జనజీవన స్రవంతిలో స్థిరపడేందుకు వీలుగా వారి పేరిట ఉన్న రివార్డులను అందజేస్తోంది. తద్వారా ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే లొంగిపోయిన వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి.. పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ […]

ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు

తెలంగాణ పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో ప్రవేశపెట్టిన ‘FIR ఎట్ డోర్ స్టెప్’ విధానం విజయవంతంగా ప్రారంభమైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా గాగిల్లాపూర్‌లో ఈ పద్ధతిలో తొలి కేసు నమోదైంది. ఒక వ్యక్తి తన విల్లాలో దొంగతనం జరిగిందని డయల్ 100కు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి బాధితుడి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు స్వయంగా బాధితుడి వద్దకే వచ్చి అక్కడికక్కడే FIR నమోదు చేయడం అనేది శాంతిభద్రతల నిర్వహణలో ఒక […]

సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిశీలిస్తుందని తెలిపారు. నైనీ కోల్ బ్లాక్‌తో పాటు మొత్తం సింగరేణి వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రుల మధ్య వాటాల గొడవలే ఈ అక్రమాలు బయటపడటానికి కారణమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తారక్‌కు స్వల్ప అస్వస్థత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ వరుసగా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వరుసగా షూటింగ్‌లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ […]

నాగ్‌పూర్‌లో అభిషేక్ విధ్వంసం.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!

పొట్టి క్రికెట్‌లో సంచలన ఆటకు కేరాఫ్‌గా మారిన అభిషేక్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వేగవంతమైన అర్ధ శతకం సాధించాడు. సిక్సర్లు, హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో అతడికిది ఏడో యాభై కావడం విశేషం. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా తొలి మూడు బంతుల్ని బౌండరీ లైన్ దాటించి […]

దొరికినంత దండుకున్న అదనపు కలెక్టర్ – ఏసీబీరైడ్స్‌లో కోట్ల అక్రమాస్తులు.. కిలోల కొద్దీ బంగారం స్వాధీనం!

హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అర్రమడ వెంకట్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని ఏసీబీ అధికారులు బుధవారం బయటకు తీశారు. రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. ఎల్బీ నగర్‌లోని ఒక విలాసవంతమైన ఇల్లు, 10 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సుమారు రూ. 30 లక్షల నగదు లభించగా, బ్యాంక్ లాకర్‌లో మరో రూ. 42 లక్షలను ఏసీబీ గుర్తించింది. వీటన్నింటికీ మించి ఏకంగా 2 […]

ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్​- అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తాం: సుప్రీం కోర్టు

అక్రమ మైనింగ్‌ కారణంగా ఆరావళి పర్వతాలకు జరుగుతున్న నష్టంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌, ఇతర అంశాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుందని పేర్కొంది. నిపుణుల కమిటీ కోసం మైనింగ్‌పై అనుభవం ఉన్న పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ ఐశ్వర్య, అమికస్‌ క్యూరీ కె.పరవేశ్వర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. నిపుణుల కమిటీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON