loader

దావోస్‌లో తెలంగాణ …’భారత్ ఫ్యూచర్ సిటీ’లో UAE పెట్టుబడులు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో భారీ విజయాన్ని అందుకుంది. ‘ భారత్ ఫ్యూచర్ సిటీ ‘ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం   ముందుకొచ్చింది. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ చర్చల్లో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ […]

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. ఉగాది నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్..

ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు భాగస్వామ్యం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ సహా వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో పవన్ […]

దావోస్‌లో సీఎం రేవంత్.. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా బడా కంపెనీలతో చర్చలు !

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. “తెలంగాణ రైజింగ్” నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో మొదటి రోజే పలు కీలక ఒప్పందాలకు పునాది పడింది. గూగుల్, యూనిలీవర్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.

ఉపాధి హామీ పథకం అంతానికి కుట్ర- పేదల పొట్టకొట్టి అంబానీలకు పెడతారా? : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తర్​ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కార్యకర్తల సమావేశంలో మోదీ సర్కార్ తీరును ఎండగట్టారు. మోదీ విధానాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయని “ప్రధాని మోదీకి ఉపాధి హామీ పథకం అంటే గిట్టదు. ఈ పథకాన్ని ఎగతాళి చేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేయాలని చూస్తున్నారు. పేద కార్మికులకు దక్కాల్సిన డబ్బును, అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు మళ్లించడమే ఆయన లక్ష్యం.దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండాలని మోదీ కోరుకుంటున్నారు. మేం పేదలను కాపాడుతుంటే,మోదీ […]

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి – ఓ తరం అభివృద్ధి చెందాలి: సీఎం చంద్రబాబు

అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్‌ విధానం తెచ్చామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వన్ ఫ్యామిలీ-వన్ ఆంట్రపెన్యూర్‌ విధానంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి, ఓ తరం అభివృద్ధి చెందాలన్నారు. తన ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలన్నారు.

ఓమన్‌లో భారతీయులకు ఊహించని షాక్! ఆ ఉద్యోగాలపై శాశ్వత నిషేధం..

వలస కార్మికులకు గల్ఫ్ దేశమైన ఒమన్ పిడుగు లాంటి వార్త చెప్పింది. కీలక కార్మిక సంస్కరణ (Labour reform) తీసుకొచ్చింది. ఇది 200 కంటే ఎక్కువ వృత్తులలో ప్రవాసులు పనిచేయకుండా నిషేధిస్తుంది. ప్రభుత్వం అన్ని రెస్ట్రిక్టెడ్‌ రోల్స్‌ డీటైల్డ్‌ లిస్టుని రిలీజ్‌ చేయలేదు. అయితే ఈ నిషేధం హాస్పిటాలిటీ; అడ్మినిస్ట్రేటివ్‌, క్లెరికల్‌ సర్వీసెస్‌ రంగాలు,సూపర్వైజరీ రోల్స్‌, కొన్ని మేనేజ్‌మెంట్‌ పొజిషన్స్‌కి వర్తిస్తుందని అధికారులు ధృవీకరించారు. ఇవి భారతీయుల సహా ప్రవాసులు ఎక్కువగా పని చేసే రంగాలు కావడం […]

దమ్ముంటే ఆ వీడియో బయటపెట్టు..! సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “రేవంత్ రెడ్డి.. నీకు దమ్ముంటే నన్ను విచారించినప్పుడు తీసిన పూర్తి వీడియోను బయటపెట్టు. అంతేగానీ నీ పత్రికలకు చిల్లర లీకులు ఇవ్వొద్దు” అని ఘాటుగా హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనను ‘లీకుల ప్రభుత్వం – స్కాముల ప్రభుత్వం’గా హరీశ్ రావు అభివర్ణించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

అర్హులైనకళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి : ఆర్‌.కృష్ణయ్య

తెలంగాణ కళాకారులు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అర్హులైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని మంగళవారం ఇందిరాపార్కు వద్ద పోరు దీక్ష చేపట్టారు.

అరగంటకోసారి ఫోన్ వస్తోంది…సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

సిట్ విచారణలో ఏం జరిగిందో హరీష్ రావు మాటల్లోనే ఏమన్నారంటే.. ఈరోజు సిట్ విచారణలో నన్ను అధికారులు అడిగిందే అడిగారు. సొల్లు పురాణం తప్ప ఏమిలేదు. ఓ అరగంట అడగానే బయట నుండి ఫోన్లు వస్తున్నాయి. మరో అరగంట అడగగానే సైగలొస్తాయి. మళ్లీ వెళ్లి ఫోన్ మాట్లడి వచ్చి అడుగుతున్నారు. ఆ ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, సీపీ సజ్జనార్ చేస్తున్నాడో తెలియాలి. విచారణ సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే  ముగ్గురు అధిాకారులు బయటకు పోతున్నారు. అడిగిందే […]

‘సముద్రయాన్’…మేలోనే ప్రయాణం మొదలెట్టనున్న ‘మత్స్య-6000’

‘సముద్రయాన్’ ప్రయోగానికి ఇండియా సిద్ధమవుతోంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య-6000’ అనే సబ్ మెరైన్ ను ఇండియా వచ్చే మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనుంది. ‘మత్స్య-6000’.. ఇండియా డెవలప్ చేస్తున్న నాలుగోతరం సబ్ మెరైన్. డీప్ ఓషన్ మిషన్ (డీఓఎం) కింద 2021లో రూ.4,077 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సెంటర్లో ఇది ఇప్పుడు పూర్తి కావస్తోంది. 25 టన్నుల బరువు గల ఈ ‘మత్స్య-6000’ సముద్రంలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON